పల్లెటూరి వినోదం

30 Jun, 2023 01:15 IST|Sakshi

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్‌ ఖాన్‌లు’. శివ కల్యాణ్‌ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్‌ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు.

‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్‌ నగర్‌ స్లాంగ్‌లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్‌ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్‌ పాలమూర్, అవినాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, అఖిలేష్‌ గోగు, రియాన్‌.
∙ఆసిఫ్‌ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్‌

>
మరిన్ని వార్తలు