Tiger Nageswararao Movie: రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. ట్రైలర్ రిలీజ్‌ ఎప్పుడంటే?

26 Sep, 2023 21:14 IST|Sakshi

మాస్ మహారాజా రవితేజ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతున్నారు. రవితేజ, నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్‌ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్‌ అగర్వాల్‌  నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. 

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్‌ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.  ఇట్స్‌ టైమ్‌ టూ రోర్ అంటూ రవితేజ మాస్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో సిగరెట్‌ తాగుతూ పక్కా మాస్ లుక్‌లో కనిపించారు. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

మరిన్ని వార్తలు