‘స్విమ్‌ ఫొటో’.. క్షమించమని అడిగిన హీరో!

12 Nov, 2020 16:05 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ తాజాగా షేర్‌ చేసిన మాల్దీవుల ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. టైగర్‌ తన రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ దిశ పటానీతో కలిసి బుధవారం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం టైగర్‌ ష్రాఫ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. చిన్న పసుపు రంగు షాట్‌‌ ధరించి ఉన్న ఈ ఫొటోకు అతడు పెట్టిన టైటిల్‌ నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటుంది. ‘ప్లీజ్‌ నా ఎల్లో హాట్‌ ప్యాంట్‌కు క్షమించండి.. ఈ లాక్‌డౌన్‌లో నేను పెరిగానా లేక నా ప్యాంట్స్‌ షింక్‌ అయ్యిందో అర్థం కావడం లేదు’ అంటూ చమత్కరించి నెటిజన్‌లను నవ్వించాడు. (చదవండి: టైగ‌ర్ ష్రాఫ్‌ ఎన్ని కిలోలు ఎత్తాడో తెలుసా?)

Pls excuse the yellow hot pants 😅Either ive grown or my shorts have shrunk this lockdown ☀️ @intercontinental_maldives #islandlife🌴 #intercontinentalmaldives #intercontinentallife

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on  

ఇటీవల టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్దా కపూర్‌ నటించిన ‘భాగీ-3’ ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా భారీగానే కలెక్షన్‌లు వసూలు చేసింది. తన తండ్రి జాకీష్రాఫ్‌తో కలిసి నటించిన మొదటి సినిమాలో రితేష్‌ దేశ్‌ముఖ్‌, అంకితా లోఖండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ప్రస్తుతం ‘టైగర్‌’ భాగీ సీక్వెల్‌ ‘భాగీ-4’తో పాటు ‘హీరోపంటి-2’లో నటిస్తున్నాడు. (చదవండి: అక్ష‌య్ అడిగేసరికి భ‌య‌మేసింది: హీరో)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు