టైగ‌ర్ ష్రాఫ్‌ ఎన్ని కిలోలు ఎత్తాడో తెలుసా?

1 Sep, 2020 12:57 IST|Sakshi

కండ‌లు తిరిగిన యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు క‌స‌ర‌త్తులు చేస్తూ ఉంటారు. నెల‌ల త‌ర‌బ‌డి విరామం త‌ర్వాత‌ షూటింగ్స్ మ‌ళ్లీ ప్రారంభ‌వ‌మ‌వుతుండటంతో ఎక్స్‌ట్రా డోసులో వ్యాయామం చేస్తున్నారు. త‌న ఫిట్‌నెస్ స్టూడియోలో చెమ‌ట‌లు చిందిస్తున్న వ‌ర్క‌వుట్‌ వీడియోను ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో అత‌ను అత్యంత బ‌రువున్న దాన్ని పైకి ఎత్తే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో టైగ‌ర్ దాన్ని కొంత వ‌ర‌కు మాత్ర‌మే ఎత్త‌గ‌లిగి విఫ‌ల‌మ‌య్యారు. కాసేప‌టికి మ‌రోసారి దాన్ని పై వ‌ర‌కు గాలిలో ఎత్తి ఉంచ‌గ‌లిగి స‌ఫ‌ల‌మ‌య్యారు. (చ‌ద‌వండి: బాలీవుడ్ న‌టి తండ్రికి క‌రోనా పాజిటివ్)

ఈ వీడియోను చూసి అభిమానులు అబ్బుర‌ప‌డుతున్నారు. ఆమె ప్రేయ‌సిగా భావిస్తున్నబాలీవుడ్ న‌టి దిశా ప‌టానీ కూడా అత‌ని ప్ర‌తిభ‌ను ప్ర‌శంసిస్తూ చ‌ప్ప‌ట్లు కొడుతున్న ఎమోజీల‌ను పెట్టారు. ఇంత‌కీ టైగ‌ర్ ఎన్ని కిలోల బ‌రువు ఎత్తార‌ని భావిస్తున్నారు? యాభ‌య్యో, వందో కిలోలో కాదు, ఏకంగా 220 కిలోలు. కాగా ఆయ‌న ప్ర‌స్తుతం "హీరో పంతి 2" చిత్రంలో న‌టిస్తున్నారు. ఆ త‌ర్వాత హాలీవుడ్ హీరో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘రాంబో’ రీమేక్‌లో న‌టించ‌నున్నారు. ఇది 2021 చివ‌ర్లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. (చ‌ద‌వండి: వారిద్దరిప్పుడు కలిసి జీవించడం లేదు: కృష్ణ ష్రాఫ్‌‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా