‘దిశా.. యమ హాట్‌గా ఉన్నావ్‌’

20 Feb, 2021 11:52 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ టైగర్‌ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్‌ చేస్తున్నారని గత కొంతకాలంగా బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  హాలీడేలు, డిన్నర్‌లు, పార్టీలు అంటూ బీ-టౌన్‌ రోడ్లపై  చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతుంటారు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. తాజాగా తన ఫ్రెండ్‌ పెళ్లికి హాజరైన దిశా ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. షేన్ పీకాక్ లెహెంగాలో ఎంతో అందంగా మెరిసిపోతున్న దిశా..హేర్‌, అండ్‌ మేకప్‌అప్‌ చేసుకుంది నేనే అంటూ ఓ క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్‌ చేసింది. దీనికి  టైగర్ ష్రాఫ్ కామెంట్‌ చేస్తూ 'హాట్‌' అనే ఎమోజీతో కామెంట్‌ చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌ మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ఇక తమ రిలేషన్‌షిప్‌ గురించి రీసెంట్‌గా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన దిశా పటానీ టైగర్‌ ష్రాఫ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.


'టైగర్‌ పట్ల నాకెంతో ఆరాధనా భావం ఉంది. తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ఇండస్ట్రీలో తను కాకుండా  వేరే స్నేహితులెవరూ లేరు’ అని చెప్పుకొచ్చింది. గతేడాది న్యూ ఇయర్‌ సెలబబ్రేషన్స్ కోసం ఇద్దరూ కలిసి జంటగా మాల్దీవులకు వెళ్లొచ్చారు. అయితే ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేయకుండా జాగ్రత్త పడ్డారు. టైగర్‌తోనే కాకుండా అతడి తల్లి అయేషా, చెల్లి క్రిష్ణతో కూడా దిశా తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి.సినిమాల విషయానికి వస్తే..ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ..బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏక్తాకపూర్‌ నిర్మిస్తున్న కెటీనా అనే చిత్రంలోనూ నటించనుంది. 

చదవండి : (టైగర్‌ ష్రాఫ్‌ ఫ్యామిలితో దిశా పటానీ టిక్‌టాక్‌)
(ఏడేళ్ల వివాహ బంధం.. విడాకులు కోరిన స్టార్‌ కపుల్‌)

A post shared by disha patani (paatni) (@dishapatani)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు