TikTok Star Cooper Noriega: ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి

12 Jun, 2022 15:07 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌: అమెరికన్‌ టిక్‌టాక్‌ స్టార్‌ కూపర్‌ నోరిగ(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం(జూన్‌ 9న) లాస్‌ ఏంజిల్స్‌లోని మాల్‌లో పార్కింగ్‌ లైన్‌లో శవమై కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అతడు మృతి చెందడానికి కొన్ని గంటల క్రితం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బెడ్‌పై సేద తీరుతున్న కూపర్‌ 'యుక్త వయసులోనే చనిపోతామేమో అని ఎవరు ఆలోచిస్తున్నారు?' అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది గంటలకే అతడు నిర్జీవంగా కనిపించడం గమనార్హం.

కొంతకాలంగా కూపర్‌ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 5న టిక్‌టాక్‌లో అతడు ఓ వీడియో షేర్‌ చేస్తూ.. 'మీ సాదకబాధకాలను నాతో చెప్పుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా బాధిస్తుందనేది నాకు తెలుసు, మీరు ఒంటరి కాదు.. మీకు నేనున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇక కూపర్‌కు టిక్‌టాక్‌లో 1.77 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఫన్నీ స్కేట్‌ బోర్డింగ్‌ వీడియోలతో పాటు ఫ్యాషన్‌ వీడియోలను సైతం టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేవాడు కూపర్‌.

చదవండి: ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన
నా సినిమా ఫ్లాప్‌ అయినా కూడా రానా బాగుందనేవాడు

మరిన్ని వార్తలు