‘బిగ్‌బాస్‌’లోకి టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు!

9 Feb, 2021 15:52 IST|Sakshi

దుర్గారావు.. సోషల్‌ మీడియాలో ఈ పేరు ఒక సంచలనం. టిక్ టాక్‌ను ఈయన వాడుకున్నంత బాగా ఎవరూ వాడుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టిన పెరిగిన దుర్గారావు.. టిక్‌టాక్‌ ద్వారా ఫేమస్‌ అయ్యాడు. తన భార్యతో కలిసి వేసిన స్టెప్పుల్లో సోషల్‌ మీడియాలో ఎంత ఫేమస్‌ అయ్యాయో అందరికి తెలిసిందే. రఘు కుంచె సంగీత సారధ్యంలో వచ్చిన ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటతో దుర్గారావు మరింత ఫేమస్ అయ్యాడు. దుర్గారావు స్టెప్పులను సినీ హీరోలు కూడా వేశారంటే.. మనోడికి ఎంత క్రేజ్‌ ఉందో అర్థమవుతుంది.

టిక్‌టాక్‌ బ్యాన్‌ అయినప్పటికీ.. దుర్గారావు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు. టిక్‌టాక్‌ ఇచ్చిన గుర్తింపుతో ఆయన సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.ఈ మధ్యే జగపతిబాబుతో కలిసి స్టేజీపై డాన్సులు కుమ్మేసాడు దుర్గా రావు. ఇటీవల విడుదలైన రవితేజ ‘క్రాక్‌’లో మెరిశాడు. ఇలా పలు సినిమాల్లో చాన్స్‌ కొట్టేసిన దుర్గారావుకు.. తాజాగా మరో బంపరాఫర్‌ తగిలిందని ప్రచారం సాగుతోంది. బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి దుర్గారావు ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దుర్గా రావుకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఉంది. పైగా మంచి ఎంటర్‌టైనర్ కూడా. అందుకే దుర్గా రావును బిగ్ బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్‌గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజమైతే దుర్గారావు నక్కతోకను తొక్కినట్లే. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి యూట్యూబ్‌ స్టార్‌  షణ్ముఖ్‌ జశ్వంత్‌ యాంక‌ర్ ర‌వి, క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది పేర్లను నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? ఐదో సీజన్‌లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విజయవంతం కావడంతో ఐదో సీజన్‌కు నిర్వాహకులు అప్పుడే పనులు మొదలు పెట్టారు. దీని కోసం వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం.


చదవండి : 
బిగ్‌బాస్‌ 5 : మొదటి కంటెస్టెంట్‌ పేరు ఖరారు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు