టాప్‌లెస్‌ ఫొటో, నెటిజన్‌కు కౌంటరిచ్చిన నటి!

6 Jun, 2021 09:54 IST|Sakshi

నిత్యం ఫొటోషూట్‌లతో అభిమానులను అలరించే టీవీ నటి టీనా దత్తా ఇటీవల షేర్‌ చేసిన ఫొటో ఒకటి తీవ్ర విమర్శలపాలైంది. ఆ ఫొటోలో టీనా టాప్‌లెస్‌గా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కయ్యారు. ఇది మరీ శృతి మించినట్లుందని కొందరు బాహాటంగా విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఓ నెటిజన్‌ మరీ దారుణంగా నటిని కించపరుస్తూ కామెంట్లు చేశాడు. ఇది చూసిన టీనా దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

అందులో తన మీద నోరుపారేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ట్యాగ్‌ చేసింది. దీంతో హడలెత్తిపోయిన సదరు నెటిజన్‌ వెంటనే ఆమెను సోదరిగా సంబోధిస్తూ క్షమాపణలు చెప్పాడట. 'ఇప్పటిదాకా నోటికొచ్చి మాట్లాడాడు, ఇప్పుడేమో సడన్‌గా అతడికి నేను సోదరినయ్యాను' అని టీనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా 'పితా మాతా సంతాన్‌' అనే బెంగాలీ సినిమాలో బాలనటిగా కనిపించిన టీనా 'ఉత్తరన్‌' సీరియల్‌లో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల మనసు దోచింది. గతేడాది వచ్చిన 'నక్సల్‌బరి' వెబ్‌సిరీస్‌లోను అభినయానికి ఆస్కారమున్న పాత్రలో నటించింది. 

చదవండి: 'అతడితో స్నేహం, నన్ను సెక్స్‌ వర్కర్‌ అనుకున్నారు'

5జీ పిటిషన్ విచారణలో హైడ్రామా, పాటలు పాడి.. ​

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు