సుధీర్‌‌ తొలి ప్రేమ కథ తెలుసుకోవాలని ఉందా..

27 Feb, 2021 16:46 IST|Sakshi

నటుడు సుధీర్‌బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది. దీనికంటే ముందు సమ్మోహనం, వీ చిత్రాలు రూపొందాయి. ఈ సినిమాలో సుధీర్‌కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించనుంది. వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. పీవీ వింద్యా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్‌14 సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ఇంకా ఫిక్స్‌ చేయలేదు. ఈ నేపథ్యంలో సుధీర్‌బాబు శనివారం సోషల్‌ మీడియాలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. సుధీర్‌14గా రూపొందుతున్న ఈసినిమా టైటిల్‌ను మార్చి 1న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 90 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ప్రేమ గురించి మాట్లాడుతూ తమ మొదటి ప్రేమ కథను అందరికి ఎలా వివరిస్తామో చెబుతామన్నారు.

‘‘ప్రేమకథలు నచ్చని మనుషులు ఉండరు కదా. ఎందుకంటే ప్రేమ లేని జీవితం ఉండదు కనుక!. అయితే నాలాంటి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్టమొదటిసారి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మొదలుపెడతాడు. అయితే, ఒక్కసారి అబ్బాయిలందరూ సరదాగా గుర్తుతెచ్చుకోండి. మొదటిసారి మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా మొదలుపెట్టారు? కింద కామెంట్స్‌ ద్వారా మాకు తెలియజేయండి. నాకు తెలిసి చాలామంది నాలాగే  మొదలుపెట్టి ఉంటారు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? మార్చి ఒకటో తేదీ వరకూ వేచి చూడండి’’ అంటూ ఆ వీడియోలో సుధీర్‌బాబు పేర్కొన్నారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేగాక టైటిల్‌ ఖచ్చితంగా తొలి ప్రేమలో ఉండే సహజమైన ఫీలింగ్స్‌ తెలిపే విధంగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

చదవండి:సోషల్‌ హల్‌చల్‌: ఈషా కవ్వింపు..చెమటలు పట్టిస్తున్న జాన్వీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు