తల్లి కాబోతున్న టీఎంసీ ఎంపీ నుస్రత్‌? భర్త సంచలన వ్యాఖ్యలు!

10 Jun, 2021 09:49 IST|Sakshi

ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.  ఆ మధ్య తన ఫొటోలు డేటింగ్‌ యాప్‌లో ఉన్నాయంటు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక పెళ్లి అనంతరం భర్తతో విభేదాలు, విడాకులు అంటు మరోసారి ఆమె వార్తల్లోకెక్కారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లయిన కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నుస్రత్‌ కూడా నిఖిల్‌ జైన్‌తో తన వివాహం టర్కిష్‌ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదంటూ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఆమె భర్త నిఖీల్‌ జైన్‌ సైతం స్పందించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఆడియో ఇంటర్వ్యూలో... తాను, నుస్రత్‌ విడిగా ఉంటున్నట్లు స్ఫష్టం చేశాడు. అతడు మాట్లాడుతూ.. తమ పెళ్లిని రద్దు చేయాలని కోల్‌కతా కోర్టులో సివిల్‌ దావా వేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఈ విషయంపై తానేమి మాట్లాడలేనని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో 2020 నవంబర్‌ నుంచి నుస్రత్‌ తాను విడివిడిగా ఉంటున్నట్లు నిఖిల్‌ వెల్లడించాడు. 

ఇదిలా ఉండగా నుస్రత్‌ తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో ఇది కాస్తా భర్త నిఖిల్‌ జైన్‌ చెవిన పడిందని, అది తెలిసి అతడు షాక్‌ అయ్యాడని, తను తల్లి కావడానికి తాను కారణం కాదని, ఆ బిడ్డ తన బిడ్డ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.

 చదవండి: 
భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్‌ కీలక వ్యాఖ్యలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు