'నా ప్రేమకే సెలవు..నా దారికే సెలవు'..అంటూ ఎమోషనల్‌

11 May, 2021 18:12 IST|Sakshi

ప్రముఖ యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన  తుదిశ్వాస విడిచారు. ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షోతో ఎంతో పాపులర్‌ అయిన టీఎన్‌ఆర్‌ మృతి పట్ల సినీ ఇండస్ర్టీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఇక పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్‌లో ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్‌. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి కనబరిచేవారు. అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాలను సైతం అతిధుల నుంచి రాబట్టేవారాయన.

రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులతో 4 గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. అంతేకాదు టీఎన్‌ఆర్‌ షో ఎంతసేపు చూసినా బోర్‌ కొట్టదు అనేంతగా సాగుతోంది ఆయన షో.  తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను సంపాదించుకున్నారయన. ఇక లాక్‌డౌన్‌ సమయంలో  స్టే హోం చాలెంజ్‌ను స్వీకరించిన కరోనా పట్ల భయపకుండా జాగ్రత్తలు పాటించాలని టీఎన్‌ఆర్‌ సూచించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన 'నా ప్రేమకే సెలవు..నా దారికే సెలవు' అంటూ పాడిన పాట నెట్టింట వైరలవుతోంది. 'ఈ శూన్యం నా గమ్యం..ఈ జన్మకే సెలవు'..అంటూ సాగే టీఎన్‌ఆర్‌ పాడిన ఈ పాట కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తిని పరిశ్రమ కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విచారం వ్యక్తం చేశారు. 

చదవండి : TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్‌ఆర్‌
ఆ ఇంటర్వ్యూలతో టీఎన్‌ఆర్‌ దశ తిరిగింది..

మరిన్ని వార్తలు