గర్వంగా ఉంది.. పీవీ సింధు విజయంపై మహేశ్‌ ట్వీట్‌

1 Aug, 2021 20:20 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు అభినందనలు తెలిపాడు. సింధు గెలుపు దేశానికే గర్వకారణమని, యావత్ దేశం గర్వించ దగ్గ విషయమన్నారు. ‘మరో చారిత్రాత్మక విజయం. భారత్‌ అత్యుత్తమ విజయాల్లో ఇది ఒకటి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు అభినందనలు. నాకు చాలా సంతోషంతో పాటు గర్వంగా ఉంది’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. 

ఒలింపిక్స్‌లో  రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భార‌త మ‌హిళ‌గా సింధూ చరిత్ర సృష్టించడం గర్వంగా ఉందని మంచు లక్ష్మీ ట్వీట్‌ చేసింది. అలాగే స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, యంగ్‌ హీరో నాగశౌర్య, దర్శకుడు బాబీ తదితరులు సోషల్‌ మీడియా వేధికగా సింధుకు అభినందనలు తెలిపారు. 

కాగా, ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జ‌రిగిన మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వ‌రుస గేమ్స్‌లో విజ‌యం సాధింది, క్యాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు