నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను: నటుడు అజయ్‌

4 Sep, 2021 14:09 IST|Sakshi

న‌టుడు అజ‌య్.. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్‌ హీరోలకు సమానంగా గుర్తింపు పొందాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు,ఛ‌త్ర‌ప‌తి వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన అజయ్‌ ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్‌ బిజీగా ఉండే అజయ్‌ ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మమ అనిపిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అజయ్‌ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తను సినిమాల్లోనే కాదు బయట కూడా తప్పులు చేశానంటూ టీనేజ్‌లో తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు ‘నేను 19 ఏళ్ల వయసులో ఇంట్లో డబ్బులు తీసుకుని ఫ్రెండ్‌తో కలిసి నేపాల్‌ పారిపోయాను. అక్కడ మూడు నెలలు సరదాగా గడిపాం. ఆ తర్వాత తిరిగి రావడానికి డబ్బులు లేవు. తీసుకేళ్లిన డబ్బులు అయిపోయాయి.

దీంతో ఓ హోటల్‌లో పని చేశాను. అక్కడ గిన్నెలు కడిగేవాడిని. డబ్బులు వచ్చాక తిరిగి ఇంటికి వచ్చాను. ఇవే కాదు జీవితంలో నేను చాలా తప్పులు చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కాలేజీ సమయంలో శ్వేత రావురిని ప్రేమించిన అజయ్‌ ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు. ఫస్ట్‌ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న అజయ్‌ సెటిల్‌ అయ్యాక వారి విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించారట. పెద్దల సమక్షంలో మరోసారి శ్వేతను వివాహం చేసుకున్నట్లు అజయ్‌ వివరించాడు. కాగా ప్రస్తుతం ఈ జంటకు కూతురు, కుమారుడు సంతానం. అయితే అజయ్‌ నటుడిగా బిజీగా ఉంటే భార్య శ్వేతా రావూరి పలు ఈవెంట్స్‌ పార్టిసిపేట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉండేవారు.

ఈ నేపథ్యంలో ఆమె 2017లో జరిగిన మిసెస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో పాల్గొని ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికయ్యారు. అంతేగాక 2018లో అంబాసిడర్‌ మిస్టర్‌ అండ్‌ మిస్టర్స్‌ సౌత్‌ ఇండియాగా కూడా ఎంపికయ్యారు. కానీ అజయ్‌ తన భార్యతో బయట కనిపించడం చాలా అరుదు. సినిమా ఈ వెంట్స్‌ కానీ, ఫంక్షన్స్‌కు సింగిల్‌గా హజరవుతాడు. దీంతో అతడి భార్య ఎవరూ ఎలా ఉంటుందనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో అజయ్‌ తన భార్యతో, పిల్లలతో ఉన్న ఫొటొలు ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు