ఫోన్‌ నెంబర్‌ అడిగిన నెటిజన్‌కు సాయిధరమ్‌తేజ్‌ ఫన్నీ రిప్లై

17 Jul, 2021 21:22 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినిమా షూటింగ్‌లకు ప్యాకప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో సెలెబ్రిటీలందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో తారలు వాళ్ల అభిమానులతో తరచూ మాట్లాడటమే గాక వారి వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. ఈ జాబితాలో.. కొందరు లైవ్‌లోకి వచ్చి మాట్లాడుతుంటే.. మరికొందరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెడుతూ...వారి ఫాలోవర్లతో సమయం గడుపుతున్నారు. 

కాగా ఈ లిస్ట్‌లో  మొదటిసారిగా సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టారు. ఇందులో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు మనోడు. గతంలో నెట్టింట మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మాత్రమే ఇలాంటి సెషన్స్ పెట్టేవారు. కానీ తాజాగా సాయిధరమ్ తేజ్ తన ఫాలోవర్ల కోసం ఇన్స్‌స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టారు. ఇందులో అనేక ప్రశ్నలను నెటిజన్లు అడగగా.. ఈ హీరో తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు. 

అందులో కొన్ని ‍ప్రశ్నలకు సమాధానంగా.. చిరంజీవి పవన్ కళ్యాణ్‌లు ఇన్సిపిరేషన్ అని, పవన్ కళ్యాణ్ గురువు అని, నవ్వడం నేర్పించింది నాగబాబు అని ఇలా చెప్పుకొచ్చారు. అలా సరదాగా సాగుతుండగా.. ఓ నెటిజన్ మీకు పెద్ద వీరాభిమాని అని చెబుతూ నంబర్‌ ఇవ్వండి అన్నా అని అడిగాడు. దీనికి బదులుగా సాయి ధరమ్ తేజ్‌... నాగార్జున నటించిన ‘శివమణి’ సినిమాలో ఎమ్మెస్‌ నారాయణకు సంబంధించిన సన్నివేశపు మీమ్‌ను సమాధానంగా షేర్‌ చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే నంబర్ ఇస్తే తన పరిస్థితి అలానే మారుతుందని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు