ఇక ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం: చిరంజీవి

24 Jan, 2023 21:47 IST|Sakshi

టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ సినిమా వైభవాన్ని చాటేందుకు ఇక ఒక అడుగు దూరమే ఉన్నామని అన్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్ష, ప్రార్థనలు మార్చి 12న ఫలించాలని మెగాస్టా చిరంజీవి ఆకాంక్షించారు. 

గర్వంగా ఉంది: ఎన్టీఆర్

అంతే కాకుండా చిత్రబృంద సభ్యులు సంతోషం ‍ వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్ లకు నా అభినందనలు తెలిపారు.

గౌరవంగా భావిస్తున్నా: రామ్‌ చరణ్
నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడం పట్ల నిజంగా గౌరవంగా భావిస్తున్నానని మెగా హీరో రామ్‌ చరణ్‌ అన్నారు. మన దేశానికి ఇది గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా కీరవాణి, ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. 
  

చిత్ర బృందానికి అభినందనలు: కీరవాణి
నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై సంగీత దర్శకుడు కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. 

ఆనందంగా ఉంది: ప్రేమ్ రక్షిత్ మాస్టర్

నాటు నాటు పాట ఆస్కార అర్హత సాధించడం ఆనందంగా ఉందని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. దర్శకులు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలబైరవకు కృతజ్ఞతలు తెలిపారు.  నాటు నాటును ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటునాటు పాటకు డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు.
 

ఇదొక అద్భుతం: వెంకటేశ్
నాటునాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం అద్భుతమని హీరో వెంకటేశ్ సంతోషం వ్యక్తం చేశారు.  సినిమా సిగలో మరో కలికితురాయి చేరిందన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు తెలిపారు. 

చిత్రబృందానికి అభినందనలు: బాలకృష్ణ

నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.  ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల ఆర్ఆర్ఆర్, ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర బృందాలకు కూడా అభినందనలు తెలిపారు.

భారతీయ సినిమా ప్రకాశిస్తోంది: రక్షిత్ శెట్టి
భారతీయ సినిమా గర్వించదగిన క్షణామని బాలీవుడ్ నటుడు రక్షిత్ శెట్టి అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రకాశిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు. 

నాటు దెబ్బ డైరెక్ట్‌గా ఆస్కార్‌కేః రవితేజ
కీరవాణి గారు స్క్రీన్ మీద తారక్, చరణ్‌తోపాటు ప్రపంచం మొత్తాన్ని నాటునాటు డ్యాన్స్ వేసేలా చేశారని రవితేజ  వేపించారు. నాటునాటు పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు