Naresh and Pavitra Lokesh: కంటెంట్ ఉంటే ఆదరిస్తారని మరోసారి రుజువైంది: నరేశ్

28 Oct, 2022 18:35 IST|Sakshi

కమెడియన్‌ అలీ, సీనియర్‌ నటుడు నరేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘వికృతి’కి తెలుగు రీమేక్‌గా రూపొందించారు. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అలీ సమర్పణలో నిర్మించిన ఈ సినిమాకు శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ కావడం పట్ల నటులు నరేశ్, పవిత్రా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడించారు.

(చదవండి: ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ)

ఈ సినిమాకు ఇంతలా పాజిటివ్ రివ్యూలు రావడం ఇటీవల కాలంలో తానెప్పుడు చూడలేదని నటుడు నరేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా బాగుందని చాలామంది నాకు మెసేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఇవాళ మరోసారి రుజువైందని అన్నారు. 'అందరూ బాగుండాలి.. అందులో మేము ఉండాలి' అంటూ నరేష్ కామెంట్స్ చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ..'ఈ సినిమాని అందరూ చూడండి. నిర్మాత అలీని, నరేశ్‌ను ఎంకరేజ్ చేయండి' అని అన్నారు.    


కథేంటంటే..:  శ్రీనివాసరావు(నరేశ్‌), పవిత్ర లోకేశ్‌(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్‌(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్‌కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్‌కి సెల్ఫీలు, సోషల్‌ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్‌ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్‌ పెట్టిన ఓ పోస్ట్‌ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్‌ సోషల్‌ మీడియా పెట్టిన పోస్ట్‌ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్‌ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ.
 

మరిన్ని వార్తలు