'దమ్ము' హీరోయిన్‌ కార్తీక ఏం చేస్తుందో తెలుసా?

8 Jun, 2021 19:25 IST|Sakshi

అలనాటి అందాల హీరోయిన్‌ రాధ కూతురే కార్తీక నాయర్‌. 17 ఏళ్లకే 'జోష్‌' చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ఇందులో విద్య అనే స్కూల్‌ టీచర్‌ పాత్రలో ఆకట్టుకుని ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత తమిళంలో కో(తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది.

ఇది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వడంతో యూత్‌లో కార్తీకకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. అలా హిట్టు పడిందో లేదో, వెంటనే ఈ హీరోయిన్‌ మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గుర్తింపు, ఆఫర్లు రాలేవు. దీంతో ఆమె మళ్లీ తెలుగు పరిశ్రమ వైపు తొంగి చూసింది. అలా తెలుగులో 'దమ్ము' చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టింది.

ఆ తర్వాత అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బ్రదర్‌ బొమ్మాళి'లో మాస్‌ యాంగిల్‌లో అదరగొట్టింది కార్తీక. ఈ సినిమా తర్వాత ఆమె మరే తెలుగు చిత్రంలోనూ నటించనేలేదు. దాదాపు టాలీవుడ్‌ను మర్చిపోయిన ఈ భామ 2017లో 'ఆరంభ్‌' అనే హిందీ టీవీ సీరియల్‌లోనూ నటించింది.

దీని తర్వాత కార్తీక పూర్తిగా సినిమాలకు, సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఏదేమైనా తన తల్లి రాధ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నట్లుగా కార్తీక పెద్దగా స్టార్‌డమ్‌ పొందలేకపోయింది. సినిమాల ఎంపికలోనూ పొరపాట్లు చేయడంతో ఆమెకు పెద్దగా ఛాన్సులు కూడా రాలేదన్నది సినీ పండితుల అభిప్రాయం.

యాక్టింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసిన ఆమె ప్రస్తుతం యూడీఎస్‌ హోటల్‌ గ్రూప్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. మరి రానున్న రోజుల్లో కార్తీక మరోసారి వెండితెరపై కనిపిస్తుందా? లేదా? అన్నది కాలానికే తెలియాలి.

చదవండి: Rangam: జీవా స్థానంలో శింబు ఉన్నాడేంటి?

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు