సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన సినీ పెద్దలు

14 Aug, 2021 20:22 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

క‌రోనా సెకండ్‌ వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కోసం టాలీవుడ్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానికి ఫోన్‌ చేసి సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ కోరారు. 

కాగా, గతంలో థియేటర్ల ఎలక్ట్రిసిటీ బిల్లులపై పరిశ్రమకు అనుకులంగా సీఎం జగన్‌ స్పందించిన సంగతి తెలిసిందే. దాంతో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున తదితరులు సోషల్‌ మీడియా వేదికగా సీఎం జ‌గ‌న్‌కు  ధన్యవాదాలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు