‘ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు

14 Nov, 2020 12:12 IST|Sakshi

హిందూ సాంప్రదాయాల్లో అత్యంత కలర్‌ ఫుల్‌, అందరికి నచ్చే పండుగ దీపావళి. చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్‌ కారణంగా ప్రతి పండగ కళ తప్పింది. కరోనా ఇంకా పూర్తిగా అంతరించకపోవడంతో దీని ప్రభావం దీపావళి వేడుకపై కూడా పడింది. అయితే ఇక నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ కుటుంబంతో వేడుక నిర్వహించుకోవాలని సోషల్‌ మీడియా అకౌంట్‌ల ద్వారా సూచిస్తున్నారు. చదవండి: దీపావళి.. కొత్త సినిమాల సందడి

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ బాధలన్నింటి నుంచి వెలుగు అందిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ప్రేమలు విరజిల్లాలని కోరుకుంటున్నాను. ఆర్థిక, భావోద్వేగ కారణల వల్ల ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థనలో వారిని తలుచుకోండి. - శ్రుతి హాసన్

దీపాల కాంతి మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు - రాశీఖన్నా

ఇతరుల దీపావళిని సంతోషంగా జరుపండి. ఇదే దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు మంచి పద్దతి- సోనూసూద్‌


మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ దినాన అందరూ సంతోషంగా గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ప్రేమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుతూ జీవితాన్ని ప్రకాశింపజేయడంతో పండుగను నిజమైన అర్థంలో జరుపుకుందాం. లక్ష్మీ మంచు

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మీ జీవతంలోని చీకటిని తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను- నాగార్జున

దీపావళి శుభాకాంక్షలు, టపాసులు కాల్చకండి. స్వీట్స్‌ ఎంతైనా తినండి. కుటుంబంతో దీపావళి జరుపకోండి. ఎంజాయ్‌, ఈ బాధలన్నింటి నుంచి దేవుడు రక్షిస్తాడు. - రష్మిక మందన

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు,- వెంకటేష్‌

వీరితోపాటు అనపమ పరమేశ్వరన్‌, చైతన్య అక్కినేని, కీర్తీ సురేష్‌, వరుణ్‌ తేజ్‌, విజయ్‌ సేతుపతి, రామ్‌ పోతినేని, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కూడా ప్రజలకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు