మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ గణేష్‌ చతుర్థి విషెస్‌

22 Aug, 2020 11:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ​మునుపెన్నడూ చూడని కష్టకాలం ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది. హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి రానే వచ్చింది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడంతా తమ తమ ఇళ్లల్లోనే లంబోదరుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తగు జాగ్రత్తలతో పండుగ జరుపుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విటర్‌ వేదికగా గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఇది తాత్కాలికమే, ధైర్యంగా ఉండండి: చిరంజీవి
కరోనా వైరస్‌ విజృంభణతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అందరి జీవితాలు ప్రభావితమయ్యాయి. ఇది తాత్కాలిక ఇబ్బంది మాత్రమే. మునుపటిలా ఎవరిపనుల్లోకి వాళ్లు వెళ్లే రోజులు త్వరలోనే వస్తాయి. అందరం ధైర్యంగా నిలబడదాం. షూటింగ్స్‌ ఆగిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకనే కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) తరపున మూడోసారి సినీ కార్మికులకు సాయం చేసేందుకు నిర్ణయించాం. గణేష్‌ చతుర్థి నేపథ్యంలో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 వేల మందికి ఈ సాయం అందుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిర్లక్ష్య ధోరణితో ఉంటూ కుటుంబాన్ని, జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టకండి. జాగ్రత్తగా ఉంటూ సురక్షితంగా ఉండండి. ఈ సమయంలో ఆరోగ్యమే అన్నిటికన్నా అతి ముఖ్యమైందని గుర్తుంచుకోండి.

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు
మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాదో వినయపూర్వక అభ్యర్థన. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గుంపులుగా చేరకండి. దయచేసి పర్యావతరణ హిత గణేష్‌ ప్రతిమలను ప్రతిష్టించండి. అందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుకుంటూ మీ మహేష్‌.

మాస్‌ మహరాజ రవితేజ
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరి కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. దయచేసి అందరూ పర్యావరణ హిత గణేష్‌ ప్రతిమలనే ప్రతిష్టించండి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంపులుగా చేరకుండా జాగ్రత్తలు పాటించండి. క్షేమంగా ఉండండి. 

మరిన్ని వార్తలు