వుమెన్స్‌ డే: టాలీవుడ్‌ సెలబ్రిటీల విషెస్‌

8 Mar, 2021 12:42 IST|Sakshi

బంధాలకు బహుమానం, ఆనందాలకు నిలయం, బాధ్యతలకు బంధనం, ఆత్మీయతకు ఆవాసం, అనురాగానికి అమృతం, కుటుంబానికి ఆధారం 'ఆమె'. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు షేర్‌ చేశారు.

ఏ ఇంట్లో అయితే మహిళ సంతోషంగా చిరునవ్వులు చిందిస్తుందో అక్కడ సంతోషం ద్విగుణీకృతమవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: నాగశౌర్య

పితృస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలందరికీ గౌరవాభినందనలు. మీ వల్లే సమానత్వం అంటే ఏంటో తెలుసుకోగలిగాం. కానీ ఇప్పటికీ మన సమాజం ఆదర్శంగా మాత్రం లేదు. హ్యాపీ ఉమెన్స్‌ డే: సుధీర్‌ బాబు

ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉండాలి: మహేశ్‌బాబు

నేను ఏదైనా చేయగలనంటూ మీరందరూ ఎంతగానో ప్రోత్సహించారు. మీ వల్లే నాకీ జీవితం మరింత సులువైంది. నా ఈ సూపర్‌ వుమెన్స్‌తో పాటు మహిళలందరికీ హ్యాపీ వుమెన్స్‌ డే: సమంత

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

అమ్మ బుగ్గలు గిల్లుతున్న ఫొటోను షేర్‌ చేసిన హీరో సాయిధరమ్‌ తేజ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు