టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ డైరెక్టర్‌, రైటర్‌ మదన్‌ కన్నుమూత

20 Nov, 2022 07:40 IST|Sakshi

Director Madan.. టాలీవుడ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్‌ ఆకస్మిక మరణం పొందారు. అనారోగ్యం కారణంగా అపోలో ఆసుపత్రిలో చేరిన మదన్‌ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే, మదన్‌ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్టు సమాచారం.

కాగా మదన్‌ స్వస్థలం మదనపల్లి.  సినిమాల మీద ఆసక్తితో ఎస్‌.గోపాల్‌రెడ్డి దగ్గర అసిస్టెంట్‌ కెమెరామన్‌గా చేరారు. అలా మనసంతా నువ్వే సినిమాకు పని చేశారు. పెళ్లైన కొత్తలో మూవీతో దర్శకుడిగా మారారు. "ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
 

మరిన్ని వార్తలు