Salmaan Khan and Puri: స‌ల్మాన్ ఖాన్‌ని డైరెక్ట్‌ చేయనున్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ..?

8 Oct, 2021 13:25 IST|Sakshi

టాలీవుడ్‌లోని టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌లో ఒకరు పూరీ జ‌గ‌న్నాథ్. తెలుగు ఎన్నో మంచి సినిమాలు చేసిన గుర్తింపు పొందిన ఆయన అమితాబ్‌ హీరోగా ‘బుడ్డా హోగా తేరే బాప్’తో బాలీవుడ్‌కి కూడా పరిచయమైయ్యాడు. అయితే తాజాగా ఆయన గురించి క్రేజీ రూమర్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. అదే కండల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌ డైరెక్ట్‌ చేయనున్నాడని.

నిజానికి సల్మాన్‌ ఖాన్‌తో పూరీ సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో గాసిప్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుందని ఫిల్మీ దునియాలో ప్రచారం జరుగుతోంది. దానికోసం ఇప్పటికే ఈ మేకర్స్‌ టీం సల్లు భాయ్‌కి అడ్వాన్స్‌ ఇచ్చి డేట్స్‌ కూడా తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఒకవేళ ఇదే గనక నిజమైతే తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్‌గా చూపించే ఈ డాషింగ్‌ డైరెక్టర్‌ ఈ కండల వీరుడ్ని ఎలా చూపించబోతున్నాడోనని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. కాగా పూరీ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తుండగా, బాలీవుడ్‌ స్టార్‌ ‘టైగర్‌ 3’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ వివాదం.. షారుక్‌ని కలిసి సల్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు