బాలీవుడ్‌పై టాలీవుడ్‌ దర్శకుల దండయాత్ర.. పక్కా ప్లాన్‌తో రెడీ!

4 Jan, 2022 17:56 IST|Sakshi

Telugu Industry Directors: బాహుబలి సిరీస్ తో రాజమౌళి, పుష్పతో సుకుమార్ పాన్‌ ఇండియా డైరెక్టర్స్ గా పేరు తెచ్చేసుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో దర్శకధీరుడు, పుష్ప 2తో సుకుమార్ నెక్ట్స్ ఇయర్ మరోసారి బాలీవుడ్ పైకి ఎటాక్ కు రెడీ అవుతున్నారు. వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది తెలుగు దర్శకులు బాలీవుడ్ పైకి దండయాత్రకు రెడీ అవుతున్నారు.పాన్‌ ఇండియా సినిమాలతో దుమ్మురేపాలనుకుంటున్నారు.

లైగర్ తో పూరి జగన్నాథ్‌ పాన్‌ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టిస్తానంటున్నాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అలాగే రాధేశ్యామ్ తో రాధాకృష్ణ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం మహేశ్‌ తో మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను కూడా పాన్‌ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేస్తోంది హారికా హసినీ క్రియేషన్స్. రాజమౌళి కంటే ముందే మహేశ్‌ బాబును బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాడు త్రివిక్రమ్‌.  అంతే కాదు రాజమౌళి, సుకుమార్ రేంజ్ లో బీటౌన్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు