టాలీవుడ్‌ డ్రగ్‌ కేసు: 10 గంటల పాటు పూరిని ప్రశ్నించిన ఈడీ

31 Aug, 2021 21:09 IST|Sakshi

టాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో ఈడీ పూరి జగన్నాథ్‌ స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. 

చదవండి: Puri Jagannadh : పూరి నుంచి కీలక సమాచారం రాబడుత్నున ఈడీ!

కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో  పూరీ జగన్నాథ్‌తో పాటు రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు.గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ 62 మందిని విచారించింది. డ్రగ్స్‌ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు