టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు: కెల్విన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

7 Sep, 2021 21:32 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌ డ్రగ్‌ కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌కు తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు జారి చేసింది. బోయినాపల్లి మాదక ద్రవ్యాల కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కెల్విన్‌ను అరెస్టు చేసి ఎల్‌ఎస్‌డి రకం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు.

2016లో మళ్లీ ఎక్సైజ్‌శాఖ కెల్విన్‌ కేసు మరోసారి అరెస్టు చేయడంతో టాలీవుడ్‌ డ్రగ్‌ వ్యవహరం బయట పడింది. ఈ నేపథ్యంలో సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడంతో కోర్టు ఆ ఛార్జ్‌సీట్‌ను విచారణకు స్వీకరించింది. దీంతో ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు