Puri Jagannadh : పూరి నుంచి కీలక సమాచారం రాబడుత్నున ఈడీ!

31 Aug, 2021 13:31 IST|Sakshi

Tollywood Drugs Case : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈడీ ముందు హాజరైన విషయం తెలిసిందే. ఆగస్టు31న ఉదయం 10.05నిమిషాలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో 2015-2021వరకు గత ఆరేళ్లలో జరిపిన బ్యాంకు లావాదేవీలు కావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. దీంతో చార్టెడ్‌ అకౌంటెంట్‌తో కలిసి బ్యాంకు లావాదేవీల వివరాలను పూరి.. అధికారులకు సమర్పించారు.

మూడు అకౌంట్లకు సంబంధించి గత ఆరేళ్లలో జరిపిన బ్యాంకు లావాదేవీల వివరాలను అందించారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే విదేశీ లావాదేవిలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. దాదాపు 5 గంటల విచారణ తర్వాత భోజన విరామం ఇచ్చారు. అనంతరం మళ్లీ విచారణ ప్రారంభించిన అధికారులు... కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. గతంలో జరిపిన ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ 12మంది సినీ తారలకు బ్యాంకు వివరాలు సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. 

చదవండి : డ్రగ్స్‌ కేసు: ఈడీ  విచారణకు హాజరైన పూరి జగన్నాథ్‌

మరిన్ని వార్తలు