Tollywood Drug Case: ఎక్సైజ్‌ శాఖకు చుక్కలు చూపిస్తున్న నిందితులు

24 Sep, 2021 12:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం టాలీవుడ్‌ డ్రగ్‌ కేసు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ కేసులో దర్శ​​కుడు పూరి జగన్నాథ్‌, హీరో రానా దగ్గుబాటి, రవితేజ, తరుణ్, నటి చార్మి కౌర్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారించింది. ఈ విచారణ ముగియడంతో పాత నిందితులు పేర్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. గతంలో ఈ కేసుపై ఎక్సైజ్‌ శాఖ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులు ఎక్సైజ్‌ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖ గతంలో 12 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో కోర్టు విచారణకు ఆదేశించింది.

కానీ నిందితులు కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 2019 నుంచి నిందితుడు సంతోష్‌ దీపక్‌ అదృశ్యం కాగా.. 2020 నుంచి ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ కోర్టుకు హజరుకావడం లేదు. మూడు సార్లు కెల్విన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అతడు హజరుకాకుండా తప్పించుకు తిరిగాడు. ఇక 2018లో నుంచి అబూబకర్‌ అనే మరో నిందితుడు కోర్టు రావడంలేదు. మరో నిందితుడు సోహెల్‌ పరారీ ఉన్నాడు. మైక్‌ కమింగ్‌ విదేశాలకు పారిపోయాడు. ఇలా నిందితులు కోర్టుకు హజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. నిందితులపై నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ చేసి వారిని పట్టుకోవడంలో జాప్యం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు