Tollywood Drugs Case 2021: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌

26 Aug, 2021 16:36 IST|Sakshi

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌ని అతలాకుతలం చేసిన డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మరుగునపడ్డ ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచింది.బుధవారం 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో 10 మంది టాలీవుడ్ ప్రముఖులు,ఇద్దరు బయటి వ్యక్తులు ఉన్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. వీరిని ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు విచారించనున్నారు.ఇదిలా ఉంటే తమకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని కొంతమంది నటులు పేర్కొనడం గమనార్హం. అయితే ఈడీ మాత్రం అందరికి నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. 
(చదవండి : బిగ్‌బాస్‌ : అఫిషియల్‌ డేట్‌ వచ్చేసింది.. లిస్ట్‌ ఇదే!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు