టాలీవుడ్‌లోకి మరో వారసురాలు.. హీరోయిన్‌గా మేధ శ్రీకాంత్‌!

28 Aug, 2021 11:53 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. నిజం చెప్పాలంటే టాలీవుడ్‌లో 80 శాతం వరకు వారసులదే హవా కొనసాగుతుంది. అయితే ఈ వారసుల్లో ఎక్కువ వరకు మగవారే ఉండడం గమనార్హం. చాలా తక్కువ మంది హీరోలు తమ కూతుళ్లును  సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేస్తున్నారు. వారిలో సక్సెస్‌ రేట్‌ కూడా తక్కువే. ప్రస్తుతం ఉన్న స్టార్‌ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక, శివాణి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో శ్రీకాంత్‌ కూతురు మేధ కూడా చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

17 ఏళ్ల మేధ త్వరలోనే హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరువబోతుందనే వార్త టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె భరత నాట్యంలో శిక్షణ తీసుకుంటుందట. ఇక కూతురు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా మంచి కథలను సెలక్ట్‌ చేసే పనిలో ఉన్నారట శ్రీకాంత్‌, ఊహ. ఇప్పటికే కొన్ని కథలను కూడా విన్నారట. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో శ్రీకాంత్‌ వారసురాలిని మనం సిల్వర్‌ స్క్రీన్‌పై చూడొచ్చు. మరోవైపు శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ ‘నిర్మల కాన్వెంట్‌’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుర్ర హీరో  కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’అనే సినిమా చేస్తున్నాడు.
(చదవండి: 'పుష్ప' విలన్‌ వచ్చేశాడు... గుండుతో ఫహద్‌.. లుక్‌ అదిరిందిగా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు