Dimple Hayathi: 'అదే డీసీపీ అసలు ఉద్దేశం.. అందుకే డింపుల్‌పై తప్పుడు కేసు'

23 May, 2023 15:56 IST|Sakshi

రామబాణం ఫేం డింపుల్‌ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హీరోయిన్‌ డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారని అన్నారు. అంతే కాకుండా డింపుల్ కారు పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని రోడ్డు మీద సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాము రెండు నెలలుగా అడుగుతున్నామని తెలిపారు. ఈ విషయంలో తాము లీగల్‌గానే పోరాటం చేస్తామని వెల్లడించారు. 

(ఇది చదవండి:డింపుల్‌ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!)

డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ..'డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు రాష్‌గా మాట్లాడారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ. చాలాసార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ను కాలుతో తన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతాను అని బెదిరించడంతో.. తిరిగి డింపుల్‌పైనే కేసు పెట్టారు. ఆమెను వేధించాలనేదే డీసీపీ ఉద్దేశం. క్వార్టర్స్‌లో ఉండకుండా డీసీపీ ఇక్కడ ఎందుకు ఉన్నారు.' అంటూ ఆరోపించారు.

లీగల్‌గానే ఫైట్ చేస్తాం: సత్యనారాయణ

న్యాయవాది మాట్లాడుతూ.. 'సిమెంట్ బ్రిక్స్ తేవాలి అంటే.. చిన్న క్రేన్‌తో తేవాలి. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్‌లో వాటిని ఎలా తెస్తారో ముందు చెప్పాలి. ప్రభుత్వ ప్రాపర్టీని మిస్ యూజ్ చేస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా?. అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడతారా? ఒక సెలబ్రిటీగా.. అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఐపీఎస్ తన డ్రైవర్‌తో కేసు పెట్టించారు. డింపుల్ కూడా ఫిర్యాదు చేసింది.. కానీ తీసుకోలేదు. 4 గంటలు పీఎస్‌లో కూర్చోపెట్టారు. ఈ కేసులో మేము లీగల్‌గానే ఫైట్ చేస్తాం.' అని అన్నారు. 

(ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్‌ టాప్‌ హీరో.. ఎవరై ఉంటారబ్బా?)

మరిన్ని వార్తలు