టాలీవుడ్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలి: విజయేంద్ర ప్రసాద్‌

9 Sep, 2022 00:55 IST|Sakshi
ప్రసన్న కుమార్, విజయేంద్ర ప్రసాద్, మోహన్‌

‘‘తెలుగులో ‘టాలీవుడ్‌ హబ్‌’ ఏర్పాటు చేయాలి. దీని కోసం దక్షిణ భారత చిత్రనిర్మాతలు, దర్శకులు తదితరులను ఆహ్వానించాలి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్, ఇతర సినిమా అసోసియేషన్స్ సహకారంతో హైదరాబాద్‌లో సభ నిర్వహించాలి.

ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీగారిని ఆహ్వానించాలి’’ అన్నారు రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌. గురువారం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యాలతయానికి వెళ్లిన విజయేంద్ర ప్రసాద్‌ను నిర్మాతల మండలి తరఫున ప్రసన్న కుమార్, మోహన్‌ వడ్లపట్ల సత్కరించారు.

మరిన్ని వార్తలు