కాపీ కొట్టారు.. ‘బలగం’ కథ నాదే..

5 Mar, 2023 17:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌(పంజగుట్ట): దిల్‌ రాజు కుమార్తె నిర్మించిన బలగం సినిమా కథ తనదేనని, అయితే తన అనుమతి తీసుకోకుండానే తాను రాసిన కథతో సినిమా తీశారని, టైటిల్స్‌లో కనీసం తన పేరు కూడా వేయలేదని పాత్రికేయుడు గడ్డం సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన తాత మరణాంతరం జరిగిన కార్యక్రమాల ఆధారంగా తాను 2011లో కథ రాసుకున్నానని, అది 2014 డిసెంబర్‌ 14న ఓ తెలుగు దినపత్రికలో‘పచ్చికి..’ పేరుతో ప్రచురితమైందన్నారు. కాగా ఇటీవల వచ్చిన బలగం చిత్రం తెలంగాణ యాసలో వచ్చిందని తెలిసి, రివ్యూ రాద్దామనే ఆలోచనతో ప్రీమియం షోకు వెళ్లగా సినిమా మొత్తం తన పచ్చికి కథే ఉండటం చూసి ఆశ్చర్యం వేసిందన్నారు.

చదవండి: గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న నటుడు, ఏడాదిగా..

మరిన్ని వార్తలు