చాన్స్‌ లేదు.. వచ్చినా బోల్తా పడ్డాయి.. చిన్న సినిమాలకు విచిత్ర పరిస్థితి!

23 Apr, 2022 14:37 IST|Sakshi

గత రెండేళ్లు కరోనా కారణంగా థియేటర్స్ సరిగ్గా తెరుచుకోలేదు.దాంతో చిన్న సినిమాలకు విడుదలకు పెద్దగా దారి దొరకలేదు. థర్డ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల క్రితం పరిస్థితులు మల్లీ కనిపించాయి. అందుకు తగ్గట్లే పెండింగ్ లో ఉన్న బిగ్ మూవీస్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా థియేటర్లకు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేశాయి. త్వరలో ఆచార్య , సర్కారు వారి పాట, ఎఫ్ 3 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

అయితే పూర్తిగా తెరుచుకున్న థియేటర్స్,కేవలం బిగ్ మూవీస్, పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపతున్నాయే తప్ప..చిన్న సినిమాలకు మాత్రం దారి దొరకడం లేదు.మొన్నటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో తెలుగులో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకలేదు.దాంతో కేజీయఫ్ 2 రిలీజైన తర్వాతి వారం థియేటర్స్ రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాయ్ చాలా చిన్న చిత్రాలు. వీటిల్లో  జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణవృందా విహారి సినిమాలు ఉన్నాయి.
(చదవండి: నేషనల్‌ క్రష్‌కి క్రేజీ ప్రాజెక్ట్‌.. మరో పాన్‌ ఇండియా చిత్రంలో రష్మిక!)

కాని కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర భీకరంగా కంటిన్యూ అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 750 కోట్లు దాటిపోయింది.టాలీవుడ్ లోనూ ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంది.అందుకే చిన్న చిత్రాలు రాకీభాయ్ కు ఎదురెల్లే సాహసం  చేయలేక వాయిదా వేసుకుంటున్నాయి. 

కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద పేలలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బిగ్ హీరోస్ మాత్రమే బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఒక్క డీజే టిల్లు మాత్రమే స్మాల్ మూవీతో బిగ్ కలెక్షన్స్ రాబట్టాడు. సూపర్ మచ్చి, హీరో, గుడ్ లఖ్ సఖి, సెబాస్ఠియన్,  ఆడవాళ్లకు మీకు జోహార్లు,  స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలు మినిమం వసూళ్లు లేక డీలా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదలై, ప్రేక్షకులను మెప్పించలేక డీలా పడ్డాయి.

మరిన్ని వార్తలు