ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ‘ట్యాక్సీ’  టైటిల్ లోగో విడుదల

24 Oct, 2021 19:24 IST|Sakshi

వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ట్యాక్సీ’. హెచ్ అండ్ హెచ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై హరిత సజ్జ ( ఎం.డీ) నిర్మిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు పనిచేసిన హరీష్ సజ్జా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బిక్కి విజయ్ కుమార్ (ఎం.టెక్‌) సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.


వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగో పోస్టర్ ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ పోస్టర్ విషయానికి వస్తే.. ఓ గన్ పై కార్ ఉండడం.. అలాగే బ్యా‍​క్‌గ్రౌండ్‌లో వైజాగ్ మ్యాప్ కూడా కనిపిస్తుండడం వంటివి  ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉందని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని మూవీ టీం చెప్పింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.

చదవండి: ‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేసిన రాఘవేంద్రరావు

మరిన్ని వార్తలు