ఎస్పీ బాలుకి టాలీవుడ్‌ స్వరనీరాజనం, 12 గంటల పాటు..

30 May, 2021 18:28 IST|Sakshi

గాన గంధర్వుడు, స్వర్గీయ  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని పురస్కరించుకొని టాలీవుడ్‌ ఆయనకు ఘన నివాళి అందించబోతోంది.  బాలు జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలుగు సినిమాకే కాక భారతీయ సినిమాకి బాలు చేసిన సేవలను గుర్తు చేస్తూ   టాలీవుడ్  ఆయనకు ఘన నివాళి అర్పించబోతోంది.

జూన్‌ 4న  ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా సినీరంగానికి చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. నాన్ స్టాప్‌గా జరిగే ఈ ప్రోగ్రామ్‌ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు