Jakkula Nageswara Rao: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి

2 Dec, 2021 20:44 IST|Sakshi

‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వరరావు

Tollywood Producer Jakkula Nageswara Rao Died In Road Accident: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరావు(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీల మరణాన్ని జీర్ణించుకోకముందే నిర్మాత నాగేశ్వరావు మృతి టాలీవుడ్‌ను మరింత విషాదంలోకి నెట్టింది. ఈ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మాత నాగేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం.

చదవండి: వైరల్‌ అవుతోన్న కమెడియన్‌ రఘు షాకింగ్‌ వీడియో!

ఆయన మరణ వార్త తెలిసి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత మృతికి సినీ నటీనటులు, దర్శక-నిర్మాతలు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వరుసగా చిత్రపరిశ్రమకు చెందిన వారు మృతి చెందుతుండటం టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు. 

మరిన్ని వార్తలు