టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..

1 Mar, 2021 03:06 IST|Sakshi

సాక్షి, బాపట్ల టౌన్‌: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. రౌడీ ఫెలో, స్వామిరారా, వీడు తేడా.. సినిమాల నిర్మాత కొరటాల సందీప్‌ ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం పూండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సందీప్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

"నా ప్రియ స్నేహితుడు సందీప్‌ మరణించాడన్న వార్త నన్ను తీవ్రంగా బాధించింది. స్వామి రారా సినిమాకు నువ్వు అందించిన సాయం మరువలేనిది. నీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్‌ యూ.." అని దర్శకుడు సుధీర్‌ వర్మ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా సందీప్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశాడు.

నా రౌడీ ఫెల్లో ఇక లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ  హీరో నారా రోహిత్‌.. సందీప్‌ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ రోజు ఇంత భయంకరంగా మొదలవుతుందని ఊహించలేదు అని బాధపడ్డాడు

సందీప్‌ కొరటాల మమ్మల్ని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త షాక్‌కు గురి చేసింది. ఆయన చిరునవ్వుతో సవాళ్లను ఎదిరించేవాడు. స్వామి రారా, వీడు తేడా సినిమాలకు పిల్లర్‌లా నిలబడ్డాడు. పలు సినిమాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించాడు.ఆయనెప్పటికీ మా గుండెల్లో సజీవంగా ఉంటాడు అని హీరో నిఖిల్‌ నివాళులు అర్పించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు