నిర్మాతగా కిక్‌ చూడాలంటున్న రవితేజ?

15 Apr, 2021 11:33 IST|Sakshi

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజకు ‘క్రాక్’ సినిమా రూపంలో ఓ సాలిడ్‌ హిట్ దక్కిందనే చెప్పాలి. ఇలా హిట్‌ పడిందో లేదో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వరుస ప్రాజెక్టులతో కేరీర్‌ను పరిగెత్తిస్తున్నాడీ హీరో. ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ అప్పుడే మరో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టాడు. అంతేనా ఇప్పటి వరకు హీరోగానే చేస్తున్న రవితేజ త్వరలో నిర్మాత అవతారం ఎత్తనున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. సినీ రంగంలో రవితేజ కంటే ముందే చాలామంది హీరోలు నిర్మాతలుగా మారి తమ టాలెంట్‌ను నిరూపించకున్నారు. అంతెందుకు ఇండస్ట్రీలో చిన్న హీరోలు సైతం వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఇంతకీ ఈ ఖిలాడీ ఏ సినిమా చేయబోతున్నాడు? ఏ హీరోతో చేస్తాడు? అనే కదా మీ డౌటు. మన మాస్ రాజా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్మాతగా అడుగుపెట్టబోతున్నాడట. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో సంప్రదింపులు జరపాలని సన్నాహాలు చేస్తుండగా, అల్లు అరవింద్ ఈ ప్రయత్నానికి బ్రేక్‌ వేసినట్లు సమాచారం. అరవింద్ స్వీయ సంస్థ ‘ఆహా’లో ఓ వెబ్‌ సిరీస్‌ను వీరిరువురి కలయికలో రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్త నటులను పరిచయం చేయాలని రవితేజ యోచిసున్నట్లు తెలుస్తోంది. దీనికి స్వయంగా రవితేజ దగ్గరుండి అన్ని పనులు చూసుకోనున్నట్టు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతోపాటు సిల్వర్ స్క్రీన్ మూవీస్ కూడా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. మరి మాస్ హీరోగా ఎనలేని అభిమానులను సంపాదించుకున్న ఈ విక్రమార్కుడు నిర్మాతగా మారి అందులో సక్సెస్ కిక్‌ను ఎంజాయ్‌ చేస్తాడా? లేదా? వేచి చూడాల్సిందే!

( చదవండి: రవితేజ ‘ఖిలాడి’ టీజర్‌ మాములుగా లేదుగా

మరిన్ని వార్తలు