Taraka Ratna Movie Career Records: ఓకే ఏడాదిలో 9 సినిమాలు అనౌన్స్ చేసిన తారకరత్న!

18 Feb, 2023 22:33 IST|Sakshi

సీనియర్‌ ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి తారకరత్న ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రం 2002లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సక్సెస్‌ఫుల్ ఆడియో ఆల్బమ్స్‌తో యువతకు చేరువైంది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే ఏకంగా 9 సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు నందమూరి తారకరత్న.

కానీ అతనికి అదృష్టం కలిసి రాలేదు. పదిహేనుకు పైగా చిత్రాలు చేసినప్పటికీ తారకరత్నకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషించారు. కుటుంబం విషయానికి వస్తే 2012లో నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య క్యాస్టూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. నందమూరి తారకరత్న చేసింది కొద్ది సినిమాలే అయినా  అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. హఠాత్తుగా గుండెపోటుతో ఆయన మరణించడంతో యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఈ విషాద సమయంలో ఆయన నటించిన సినిమాలను ఓసారి గుర్తు చేసుకుందాం. 

ఒకటో నంబర్ కుర్రాడు(2002)
యువ రత్న(2002)
తారక్(2003)
నో(2004)
భద్రాద్రి రాముడు(2004)
పకడై(2006)
అమరావతి(2009)
వెంకటాద్రి(2009)
ముక్కంటి(2010)
నందీశ్వరుడు(2011)
విజేత(2012)
ఎదురులేని అలెగ్జాండర్(2012)
చూడాలని.. చెప్పాలని(2012)
మహా భక్త సిరియాలా(2014)
కాకతీయుడు(2015)
ఎవరు(2016)
మనమంతా(2016)
రాజా చేయి వేస్తే(2016)
కయ్యూం భాయి(2017)
దేవినేని(2021)
సారథి(2022)

2022లో 9 అవర్స్ సిరీస్‌లోనూ నటించారు. అమరావతి సినిమాలో నటనకు బెస్ట్ విలన్‌గా నంది అవార్డ్ అందుకున్నారు తారకరత్న.

మరిన్ని వార్తలు