జోరు పెంచిన హీరోలు.. న్యూ కాంబినేషన్స్‌పై చర్చ

26 Aug, 2021 12:57 IST|Sakshi

టాలీవుడ్ లో మరోసారి,న్యూ కాంబినేషన్స్ పై చర్చ మొదలైంది.అసలే జోరు మీదున్న హీరోలు,ఇప్పుడు ఆ జోరును మరింత పెంచారట.లీడింగ్ డైరెక్టర్స్ తో మూవీస్ కమిట్ అయ్యారట. ఈ లిస్ట్ లో మెగాస్టార్, సూపర్ స్టార్, పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆ న్యూ కాంబినేషన్స్ లిస్ట్ ఓపెన్ చేసి చూద్దాం.

చిరు కొత్త సినిమాల అప్ డేట్స్ తో టాలీవుడ్ షేక్ అవుతోంది.ఇప్పటికే నాలుగు సినిమాలను లైనప్ లో పెట్టారు మెగాస్టార్. ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా ఖారారు చేశారని సమాచారం. సీటీమార్ దర్శకుడు సంపత్ నంది తోనూ, అలాగే పక్కా కమర్షియల్ మేకర్ మారుతితోనూ, చిరు కొత్త చిత్రాలు చేయబోతున్నారట.

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కూడా ఈ మధ్య వేగం పెంచాడు.సర్కారు వారి పాట పూర్తైన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు మహేశ్‌. ఆ తర్వాత రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ వంగా లాంటి దర్శకులతో సినిమాలు చేయనున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా చేరినట్లు సమాచారం. మహేశ్‌తో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అందించిన డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించనుందట.

రాఖీభాయ్ యశ్ త్వరలో డైరెక్ట్ గా తెలుగు చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడట.చాలా కాలంగా ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది.గతంలో ఒకసారి పూరి దర్శకత్వంలో యశ్ హీరోగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుందని ప్రచారం సాగింది. ఇప్పుడు అఖండ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో రాఖీ భాయ్ కొత్త చిత్రం చేయనున్నాడట.

ఒక వైపు పుష్ప సిరీస్ తోనూ,మరో వైపు ఐకాన్ ప్రాజెక్ట్ తోనూ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.ఆ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ కూడా బన్నితో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ కూడా బన్ని డేట్స్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నాడట. ఇటీవలే కలసి స్టోరీని కూడా నరేట్ చేశాడట.

మరిన్ని వార్తలు