భారీ హిట్‌ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్న ముగ్గురు డైరెక్టర్లు

8 Jul, 2023 14:21 IST|Sakshi

సినిమాలు అన్నాక హిట్స్‌తో పాటు ప్లాపులు కూడా సహజం కానీ హిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకో హిట్‌ సినిమా తీసేందకు ప్లాన్‌ చేయాలి.. ఒకవేళ ప్లాప్ వస్తే మరో భారీ హిట్‌ కొట్టేందుకు స్కెచ్‌ వెయ్యాలి. ఇలానే సినిమా ఇండస్ట్రీలో అందరికి ఉంటుంది. ఈ ముగ్గురు దర్శకులు మాత్రం మొదట్లో హిట్‌ కొట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నారు.

(ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు)

ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఆర్‌ఎక్స్‌-100'తో దర్శకుడు అజయ్‌ భూపతి సినీ ఇండస్ట్రీకి భారీ షాక్‌ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మహాసముద్రం డిజాస్టర్‌ అయింది. దాంతో తాజాగా  తన సత్తా చాటేందకు పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా మంగళవారం అనే పాన్‌ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలనుకుంటున్నాడు అజయ్‌. ఇప్పటికే ఆయన టీజర్‌ విడుదల చేశారు. దానిని చూసిన వారందరూ ఈసారి హిట్‌ కొట్టడం ఖాయం అంటున్నారు.

మరోవైపు మహేష్‌ బాబుతో 'బ్రహ్మోత్సవం' సినిమాను డైరెక్ట్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ విక్టరీ వెంకటేష్‌తో 'నారప్ప' సినిమా తీసినా అది ఓటీటీకే పరిమితం అయింది. తాజాగా ఆయన నుంచి పెదకాపు ప్రాజెక్ట్‌తో శ్రీకాంత్‌ వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన రోజు నుంచి యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది.

ఇదే కోవలో మరోక దర్శకుడు శివ నిర్వాణ కూడా ఉన్నారు. నానితో 'టక్‌ జగదీష్‌' సినిమాను తీసి.. దానిని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేశారు. అక్కడ అది ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే ఈయన ఈసారి ఇండస్ట్రీలో భారీ హిట్‌ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్నాడు. విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషన్లో 'ఖుషి' తీస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ సింగల్‌ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురి దర్శకులు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చూద్దాం ఈసారి భారీ హిట్‌ కొడతారేమో.

(ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?)


 

మరిన్ని వార్తలు