చంద్రముఖి టు విక్రమార్కుడు.. ‘సీక్వెల్’పై కన్నేసిన దర్శకనిర్మాతలు

21 Sep, 2021 21:31 IST|Sakshi

బాక్సాఫీస్ పై కాసుల వర్షాన్ని కురిపించిన సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం సీక్వెల్‌ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రముఖి సీక్వెల్ కు స్టార్ కాస్ట్ ఫైనల్ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది. 

25 ఏళ్ల క్రితం దక్షిణాదిన సంచలన విజయం సాధించింది ప్రేమదేశం. ఇప్పుడు ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు కదీర్ రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నాడు. అంతా నూతన నటీనటులతో సీక్వెల్ ను తెరకెక్కించాలనుకుంటున్నాడు.

రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్ని ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరినవే. బాహుబలికి మాత్రమే రెండో భాగం తీసాడు జక్కన్న. నిజానికి తన చిత్రాల్లో ఈగకు సీక్వెల్ తీయాలన్నది రాజమౌళి కోరిక. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేలా లేదు. మరోవైపు విక్రమార్కుడు సీక్వెల్ స్టోరీని రెడీ చేసేసారు కథారచయిత విజయేంద్రప్రసాద్. 

విక్రమార్కుడు చిత్రం  తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, హిందీ,బెంగాలీ బాషల్లోకి రీమేక్ అయింది. అన్ని చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికిప్పుడు ఈ మూవీ సీక్వెల్ ను రాజమౌళి డైరెక్టే చేసే అవకాశాలు తక్కువ. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత మహేష్ బాబుతో మూవీతో జక్కన్న బిజీగా ఉన్నాడు. మరి విక్రమార్కుడు సీక్వెల్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తాడు అనేది ఆశక్తికరంగా మారింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు