టాలీవుడ్‌కు ఏమైంది, యంగ్‌ హీరోలకు ఎందుకిలా అవుతోంది..

5 Oct, 2021 21:20 IST|Sakshi

తెలుగు సినీ పరిశ్రమలో అనుహ్య సంఘటనలు చేసుకుంటాయి. కొద్ది రోజులుగా టాలీవుడ్‌ చెందిన యంగ్‌ హీరోలు ఒక్కొక్కరిగా ఆస్పత్రి పాలు అవుతున్నారు. ఇటీవల మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. వినాయ పండగ రోజున కెబుల్‌ బ్రిడ్జ్‌ మీదుగా వెళుతున్న సాయి తేజ్‌ బైక్‌ అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ సంఘటనలో సాయి గాయపడటంతో అపోలో ఆస్పత్రి చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న సాయి తేజ్‌ ఇటీవల వస్తున్నానంటూ ట్వీట్‌ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. సాయి కంటే ముందు మరో హీరో అడవి శేషు కూడా ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. డెంగ్యూ జ్వరం కారణంగా ప్లేట్‌ లేట్స్‌ పడిపోవడంతో రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు.

ఇటీవల తాను కోలుకుని ఇంటికి వచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదిలా ఉండగా హీరో సిద్దార్థ్‌ మహా సముంద్ర షూటింగ్‌లో గాయపడ్డాడు. అతడి వెన్నుముకకు గాయమవడంతో సర్జరీ కోసం లండన్‌ వెళ్లి కొద్ది రోజుల కిందటే ఇండియాకు వచ్చాడు. తాజాగా హీరో రామ్‌ మెడకు గాయమైన సంగతి తెలిసిందే. అతడి తాజా చిత్రం రాపో 19వ సినిమా కోసం జిమ్‌లో వీపరితంగా గసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. సిక్స్‌ ప్యాక్‌ తీవ్రంగా కృషి చేస్తున్న రామ్‌ గాయపడ్డాడు. దీంతో వైద్యులు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. దీంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి మీ ముందుకు వస్తానంటూ రామ్‌ ట్వీట్‌ చేశాడు. ఇలా వేరు వేరు కారణాలతో వరుసగా యువ హీరోలంతా ఆస్పత్రి పాలవడం అభిమానుల్లో ఆందోళ కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు