ప్లాన్‌..ఇంపాజిబుల్‌..కరోనాతో ఆగిన షూటింగ్‌

7 Jun, 2021 00:36 IST|Sakshi

హాలీవుడ్‌ చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచిపోయింది. టామ్‌ క్రూజ్‌ నటిస్తున్న ఈ యాక్షన్‌ స్పై ఫిల్మ్‌కి క్రిస్టోఫర్‌ మెక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ యూకేలో జరుగుతోంది. అయితే రెగ్యులర్‌ కోవిడ్‌ టెస్టుల్లో భాగంగా చిత్రబృందానికి కరోనా పరీక్షలు చేయగా కొంతమందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాజిటివ్‌ వచ్చినవారి సంఖ్య 10మందికి పైనే ఉందని హాలీవుడ్‌ మీడియా చెబుతోంది. దీంతో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ షూటింగ్‌ను జూన్‌ 14 వరకు నిలిపి వేశారు. ఇక గత ఏడాది అక్టోబరులో కూడా ఈ చిత్రబృందంలో 12 మందికి కరోనా వచ్చి, షూటింగ్‌ నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా వల్ల మరోసారి షూటింగ్‌ ప్లాన్‌ ఇంపాజిబుల్‌ (అసాధ్యం) అయింది. ఈ ఏడాది విడుదల కావాల్సిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు