36 ఏళ్ల తర్వాత సీక్వెల్‌.. బడ్జెట్‌ రూ. 12 వందల కోట్లు

22 May, 2022 20:58 IST|Sakshi

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కెరీర్‌లో హిట్‌ సాధించిన సినిమాల్లో 'టాప్‌ గన్‌' ఒకటి. 1986లో వచ్చిన ఈ చిత్రం టామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుమారు 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టాప్‌ గన్‌: మేవరిక్‌' రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022లో ప్రదర్శించారు. 36 ఏళ్ల తర్వాత 'టాప్‌ గన్‌'కు సీక్వెల్‌గా రావడం, కేన్స్‌ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ వేయడంతో ఈ చిత్రంపై భారీ హైప్‌ ఏర్పడింది. ఈ మూవీని మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 

ఈ మూవీని రూ. 12 వందల కోట్ల బడ్జెట్‌తో జోసెఫ్‌ కోసిన్స్కీ తెరకెక్కించారు. క్రిస్టోఫర్‌ మెక్ క్వారీ రచనా సహకారం అందించారు. కాగా 1996లో వచ్చిన 'మిషన్‌ ఇంపాజిబుల్‌' సిరీస్‌ను సుమారు 25 ఏళ్లుగా తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈసినిమా సిరీస్‌తో టామ్ క్రూజ్‌ విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కెరీర్‌లో మంచి హిట్‌ ఇచ్చిన టాప్‌ గన్‌ సీక్వెల్‌కు మాత్రం 36 ఏళ్లు పట్టింది. అయితే ఈ సీక్వెల్‌ను మూడేళ్ల క్రితమే స్టార్ట్‌ చేసిన కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ కోసం టామ్‌ క్రూజ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరిన్ని వార్తలు