స్నూకర్‌ కోచ్‌

12 Dec, 2020 05:57 IST|Sakshi

సంజయ్‌ దత్‌ స్నూకర్‌ నేర్పించడానికి రెడీ అవుతున్నారు. నేర్చుకునేది ఎవరంటే దలీప్‌ తాహిల్‌. ఈ ఆటను తెరకెక్కించేది మృదు. ‘తులసీదాస్‌ జూనియర్‌’ పేరుతో ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది. తండ్రి స్నూకర్‌ కోచ్‌. కొడుకు స్నూకర్‌ ఆటగాడు. పలు అవార్డులు, రివార్డులు పొందిన స్పోర్ట్స్‌ మూవీ ‘లగాన్‌’కి దర్శకత్వం వహించిన ఆశుతోష్‌ గోవారీకర్‌ ఈ చిత్రానికి ఒక నిర్మాత. టీ సిరీస్‌తో కలసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సంజయ్‌ దత్‌ది అతిథి పాత్ర. దలీప్‌ తాహిల్, వరుణ్‌ బుద్ధదేవ్, రాజీవ్‌ కపూర్‌ తదితరులు నటించనున్నారు.

మరిన్ని వార్తలు