మొన్న ప్రభాస్, నిన్న రామ్ చరణ్,ఇప్పుడు నాగ చైతన్య!

15 Jul, 2021 13:22 IST|Sakshi

ముంబాయికి మకాం మారుస్తున్న టాలీవుడ్‌ స్టార్స్‌

టాలీవుడ్ టాప్ స్టార్స్ చాలా మారిపోయారు. పాన్ ఇండియా సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. ముంబైలో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు.మొన్న ప్రభాస్,నిన్న రామ్ చరణ్,ఇప్పుడు నాగ చైతన్య,అందరిదీ అదే దారి.

ఛలో బాలీవుడ్ ఉద్యమాన్ని టాలీవుడ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ముందుగా పాన్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ముంబైలో ఇంటిని కొనుగోలు చేయడం ఒక ఉద్యమంగా చేపట్టారు. రీసెంట్ గా ముంబైలో గృహప్రవేశం చేస్తున్న తెలుగు నటుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభాస్ ఇప్పటికే ముంబైలో టెంపరరీగా ఫ్లాట్ ను తీసుకున్నాడు. రీసెంట్ గా జాతిరత్నాలు ప్రభాస్ ను కలిసేందుకు ముంబైలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

రామ్ చరణ్ , ఉపాసన జంట తరచూ ముంబై, హైదరాబాద్ మధ్య ప్రయాణిస్తూ బిజీగా కనిపిస్తున్నారు. చరణ్ పాన్ ఇండియా సినిమాల చర్చల కోసం, మరోవైపు ఉపాసన బిజినెస్ మీటింగ్స్ కోసం ఈ మధ్య తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు.దాంతో ముంబైలోనే ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసారు ఈ మెగా జంట.

ఆమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చెద్దా కోసం ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు నాగ చైతన్య. ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడు చై. మరో వైపు సమంత కూడా ది ఫ్యామిలీ మేన్ 2 తర్వాత బీటౌన్ లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారింది. అక్కడ అవకాశాలు పెరుగుతున్నాయి. పైగా తన ఆన్ లైన్ ఫ్యాషన్ సాకీ బ్రాండ్ ను ముంబైకి కూడా ఎక్స్ పాన్డ్ చేయాలనుకుంటోంది.అందుకే వీరిద్దరు కూడా త్వరలోనే ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయబోతున్నారట.

మిషన్ మజ్ను, గుడ్ బై అనే సినిమాలు చేస్తోంది రష్మిక.నేషన్ హార్ట్ త్రోబ్ గా మారడం,పాన్ ఇండియా సినిమాల్లో బిజీ కావడం,తరచూ హైదరాబాద్, చెన్నై, ముంబై మధ్య ప్రయాణిస్తోంది రష్మిక.అందుకే ఇప్పుడు ముంబైలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ముంబైకి చెందిన సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ దార్షిని షాహ్ తో కలసి,తన ఇంటిని మరింత అందంగా ముస్తాబు చేస్తోంది.

మరిన్ని వార్తలు