Bollywood Stars Web Series On OTT: వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్‌ హీరోలు వీరే..

11 Apr, 2022 16:58 IST|Sakshi

ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్‌, బిజినెస్‌ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లతో కూడా అలరించారు కొందరు స్టార్‌ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్‌ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్‌ భాయ్‌పాయ్, కెకె మీనన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్‌ యాక్టర్స్‌కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 

1. అభిషేక్‌ బచ్చన్‌
బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్‌ బచ్చన్‌ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్‌ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్‌: ఇన్‌టు ది షాడోస్‌' వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్‌ బచ్చన్‌.

2. సైఫ్‌ అలీఖాన్‌
వెబ్ సిరీస్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్‌ స్టార్లలో సైఫ్‌ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్‌ లుక్‌, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్‌ గేమ్స్‌' వెబ్‌ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల‍్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌ కూడా వచ్చింది. 

3. అజయ్‌ దేవగణ్‌
'ఆర్ఆర్ఆర్‌'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండే అజయ్‌ దేవగణ్ తాజాగా వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌' అనే వెబ్ సిరీస్‌లో అజయ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌లో టాలీవుడ్‌ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించడం విశేషం. 

4. వివేక్‌ ఒబెరాయ్‌
బాలీవుడ్‌ 'ప్రిన్స్‌'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్‌ ఒబెరాయ్‌. బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌గా పేరొందిన ఈ హీరో రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్‌ పాత్రలు పోషిస్తున్న వివేక్‌ 2017లో 'ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌' అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్‌ చేసింది.

5. మాధవన్‌
విపరీతమైన లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో మాధవన్‌ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్‌ను చాక్లెట్‌ బాయ్‌ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్‌' వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్‌' వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. 

చదవండి: సూపర్ థ్రిల్‌ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్‌ ఇవే..
చదవండి: ఓటీటీల్లో మిస్‌ అవ్వకూడని టాప్‌ 6 సినిమాలు..

మరిన్ని వార్తలు