Top Gear: సిద్‌ శ్రీరామ్‌ పాడిన వెన్నెల వెన్నెల సాంగ్‌ విన్నారా?

25 Nov, 2022 20:48 IST|Sakshi

యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టాప్‌ గేర్‌. కె శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వెన్నెల వెన్నెల పాటను రిలీజ్‌ చేశారు. సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.

చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్‌ షాక్‌
చివరి కెప్టెన్‌గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి

మరిన్ని వార్తలు